

తెలుగు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న 'తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4' రియాలిటీ షో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ గ్రాండ్‌గా జరిగినట్లుగా తాజాగా వచ్చిన ప్రోమో చూస్తుంటే తెలుస్తోంది. ఈ మాస్ ఫైనల్స్ కు మాస్ మహారాజా రవితేజ ముఖ్య అతిథిగా హాజరై, ప్రేక్షకులకు, ఫైనలిస్ట్‌లకు అదనపు ఉత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా రవితేజ ఒక యువ గాయకుడికి తన తదుపరి చిత్రంలో పాట పాడేందుకు ఏకంగా ఆఫర్‌ను ప్రకటించి, అతడి కలను నిజం చేసేందుకు మార్గం చూపారు.
రవితేజ ఎంట్రీతో వైభవంగా ఫైనల్
తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 4 టైటిల్ విజేత ఎవరనే ఉత్కంఠ నడుమ, ఆహాలో ప్రసారం కానున్న ఈ ఫినాలే ఎపిసోడ్ (అక్టోబర్ 31, నవంబర్ 1)కు రవితేజ చేసిన ఎంట్రీ షోకే ప్రత్యేక హైలెట్స్ గా నిలిచింది. న్యాయనిర్ణేతలు ఎస్. తమన్, కార్తీక్ లతో కలిసి రవితేజ వేదికపై సందడి చేశారు. ఈ సందర్భంగా ఫైనలిస్ట్ లు తమ అత్యుత్తమ ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఫైనలిస్ట్ లు తమ పాటలతో ప్రేక్షకులను, న్యాయనిర్ణేతలను ఎంతగానో మెప్పించినప్పటికీ, ఒక యువ గాయకుడి ప్రదర్శన మాత్రం రవితేజను విశేషంగా ఆకర్షించింది. ముఖ్యంగా, ఆ గాయకుడు ఎంచుకున్న పాటల ఎంపికకు రవితేజ ప్రత్యేకంగా హ్యాట్సాఫ్' చెప్పడం విశేషం. ఆ యువ గాయకుడి గళం, టాలెంట్ రవితేజను ఎంతగానో మెప్పించాయి.
సందర్భానుసారంగా తనదైన సెన్స్ ఆఫ్ హ్యూమర్‌తో అలరించే రవితేజ, ఆ యువ గాయకుడిని ఉద్దేశిస్తూ.. 'మన సినిమాకు ఎప్పుడు పాడుతున్నావబ్బాయ్?' అని ప్రశ్నించడంతో పాటు తమన్ కు కూడా ఆ కుర్రాడితో పాడించు అని సూచించారు. నా తదుపరి సినిమాలో నా కోసం ఒక పాట పాడాల్సిందే అంటూ రవితేజ ఇచ్చిన ఈ బంపరాఫర్‌తో ఆ యువ గాయకుడి ఆనందానికి అవధులు లేవంటే నమ్మాలి.










కామెంట్స్ (3)
మాస్ మహారాజా రవితేజ ఎక్కడ ఉన్నా ఎనర్జీ డబుల్ అవుతుంది
Mass vibes all over the stage
vote for pawan kalyan 😍😍