

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి హీరోగా, కయల్ ఆనంది హీరోయిన్ గా నటించిన రొమాంటిక్ క్రైమ్ కామెడీ చిత్రం ‘ప్రేమంటే’ నవనీత్ శ్రీరామ్ దర్శకత్వంలో రూపొందింది. గత నవంబర్ 21న థియేటర్స్లో విడుదలైన ఈ సినిమా మంచి టాక్తో ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది.
ఇప్పుడు ఈ సినిమా థియేటర్ రన్ పూర్తి చేసుకుని ఓటీటీ రిలీజ్కు సిద్ధమైంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకోగా అందులో ఈ సినిమా ఎప్పుడు నుంచి స్ట్రీమ్ అవుతుంది అనేది కన్ఫర్మ్ చేశారు. ఈ డిసెంబర్ 19 నుంచి ఓటీటీలో ప్రేమంటే అందుబాటులో ఉంటుందట. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా స్ట్రీమ్ కానుంది.
థియేటర్స్లో ఈ సినిమాను మిస్ అయిన వారు ఇక ఓటీటీలో ఈ కామెడీ క్రైమ్ డ్రామాను చూడొచ్చు. ఈ చిత్రాని కి లియోన్ జేమ్స్ సంగీతం అందించగా, జాన్వీ నారంగ్ నిర్మాణం వహించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!