

చిన్న నిర్మాతలకు మినిమమ్ గ్యారంటీ హీరోగా గుర్తింపు పొందిన సుహాస్ థియేటర్లతో పాటు ఓటీటీలోనూ తన సత్తా చాటుకుంటున్నారు. ఆయన నటించిన యూత్‌ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ హే బలవంత్ ఈ నెల 20 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాగా, ఈ నెల 19 న తెలుగు రాష్ట్రాలు మరియు ఓవర్సీస్లో ప్రీమియర్స్ ప్రదర్శించబడాయి. ఈ ప్రీమియర్స్‌కు మంచి స్పందన లభించినట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మొదట ఈ సినిమాకు “హే భగవాన్” అనే టైటిల్ నిర్ణయించినప్పటికీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ అభ్యంతరాల నేపథ్యంలో విడుదలకు కొద్ది రోజుల ముందు టైటిల్‌ను “హే బలవంత్”గా మార్చారు. గోపీ అచ్చెర దర్శకత్వంలో త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్‌పై బీ. నరేంద్ర రెడ్డి నిర్మించిన ఈ చిత్రంలో శివానీ నాగారం హీరోయిన్గా నటించగా, నరేష్, సుదర్శన్, వెన్నెల కిషోర్, అన్నపూర్ణమ్మ, అజయ్ కీలక పాత్రలు పోషించారు.
సినిమా టీజర్, ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో ఈ చిత్రానికి మంచి థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. శాటిలైట్ హక్కులను జీ తెలుగు, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను జీ5 సంస్థలు ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు సమాచారం. ఒప్పందం ప్రకారం థియేటర్ విడుదలకు నాలుగు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. దీంతో మార్చి మూడో వారంలో విడుదల కావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే థియేట్రికల్ రన్‌ను బట్టి విడుదల తేదీలో మార్పులు ఉండొచ్చని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!