

హాలీవుడ్ స్టార్ లియోనార్డో డికాప్రియో ప్రధాన పాత్రలో నటించిన రాజకీయ థ్రిల్లర్ ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు పాల్ థామస్ ఆండర్సన్ దర్శకత్వం వహించారు. గతేడాది సెప్టెంబర్ 26 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులు మరియు విమర్శకుల నుండి మంచి ప్రశంసలు అందుకుంది.
తాజాగా ఈ చిత్రం బాఫ్టా అవార్డుల్లో దుమ్ము రేపి మొత్తం ఆరు విభాగాల్లో అవార్డులు గెలుచుకుంది. అంతేకాక, గోల్డెన్ గ్లోబ్ అవార్డుల్లో కూడా ఈ సినిమా సత్తా చాటింది. ఇప్పుడు ఈ సూపర్ హిట్ చిత్రం ఓటీటీలోకి రానుంది. ఈ నెల 26 వ తేదీ నుంచి జియో హాట్స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది.
ఇదే కాకుండా, రాబోయే ఆస్కార్ అవార్డుల్లో ‘వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్’ 13 విభాగాల్లో నామినేషన్ పొందింది. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడు, ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే వంటి ప్రధాన విభాగాల్లో ఈ చిత్రం పోటీ పడుతోంది. అభిమానులు ఈ సినిమాను ఓటీటీలో చూసేందుకు ఎదురుచూస్తున్నారు.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!