

సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలై మంచి విజయం సాధించిన కామెడీ ఎంటర్టైనర్ ‘నారీ నారీ నడుమ మురారి’ ఓటీటీ విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రం వచ్చే నెల 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో కూడా సినిమా అందుబాటులోకి రానుంది. ఈ నెల 14 న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సంక్రాంతి బరిలో చివరిగా వచ్చినప్పటికీ ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తి మంచి స్పందన అందుకుంది.
.jpeg)
ఇద్దరు అమ్మాయిల మధ్య చిక్కుకునే యువకుడిగా హీరో శర్వానంద్ తన టైమింగ్తో ఆకట్టుకోగా, హీరోయిన్లుగా సాక్షి వైద్య, సంయుక్త మంచి నటన కనబరిచారు. నరేశ్, సత్య, సునీల్, వెన్నెల కిశోర్ తమ మార్క్ కామెడీతో సినిమాకు ప్రధాన బలంగా నిలిచారు. వినోదాత్మక కథలపై తన పట్టును దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి నిరూపించారు. కుటుంబ సమేతంగా చూసేందుకు అనువైన ఈ సినిమా ఓటీటీలో కూడా మంచి ఆదరణ పొందే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!