

ఈ రోజు శుక్రవారం కావడంతో సినిమా ప్రేమికులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందుబాటులోకి వచ్చింది. థియేటర్లలో శ్రీ విష్ణు నటించిన మృత్యుంజయ్, వరలక్ష్మీ శరత్‌కుమార్ నటించిన సరస్వతి సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి వంటి చిన్న సినిమాలు కూడా థియేటర్లలోకి వచ్చాయి. అయితే ఈ సినిమాలపై పెద్దగా ప్రచారం లేదు.
ఇక ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం ఈ రోజు భారీగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ అవుతున్నాయి. విత్ లవ్, గాంధీ టాక్స్ వంటి డబ్బింగ్ సినిమాలు కూడా విడుదలయ్యాయి. వీటితో పాటు పలు వెబ్ సిరీస్‌లు, చిత్రాలు ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని సినిమాలు సడన్‌గా కూడా ఓటీటీల్లో వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఈ రోజు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్నవి:
నెట్‌ఫ్లిక్స్:
విత్ లవ్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 06
హలో బచ్చోన్ (హిందీ సిరీస్) – మార్చి 06
వార్ మెషీన్ (ఇంగ్లీష్ సినిమా) – మార్చి 06
బాయ్ ఫ్రెండ్ ఆన్ డిమాండ్ (హాలీవుడ్ సిరీస్) – మార్చి 06
స్టిల్ షైనింగ్ (కొరియన్ వెబ్ సిరీస్) – మార్చి 06
జియో హాట్‌స్టార్:
విక్రమ్ ఆన్ డ్యూటీ (తెలుగు సిరీస్) – మార్చి 06
టెడ్ సీజన్ 2 (హాలీవుడ్ సిరీస్) – మార్చి 06
సోనీ లివ్:
లాలో కృష్ణ సదా సహాయతే (హిందీ సినిమా) – మార్చి 06
సన్ నెక్స్ట్:
డియర్ రథి (తమిళ సినిమా) – మార్చి 06
గ్రానీ (తమిళ సినిమా) – మార్చి 06
జీ5:
గాంధీ టాక్స్ (తెలుగు డబ్బింగ్ సినిమా) – మార్చి 06
జబ్ కూలీ కితాబ్ (హిందీ సినిమా) – మార్చి 06










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!