

సంక్రాంతికి థియేటర్లకు వచ్చి ఇండస్ట్రీ హిట్ కొట్టిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు అనీల్ రావిపూడి డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) నటించిన ఈ మూవీ వింటేజ్ చిరును తిరిగి మరోసారి ప్రేక్షకులకు గుర్తు చేసి అదిరిపోయే వజయాన్ని మూటగట్టుకుంది. రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి చిరంజీవి కెరీర్లోనే అగ్ర స్థానంలో నిలిచింది. అలాంటి ఆ చిత్రం రిలీజ్ అయి నాలుగు వారాలు కావస్తున్నా మంచి రెస్పాన్స్‌తో థియేటర్లలో విజయవంతంగా రన్ అవుతుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది.కాగా ఈ మన శంకర వర ప్రసాద్ గారు పండక్కి వస్తున్నారు మూవీ ఫిబ్రవరి 11 నుంచి నెట్‌ఫ్లిక్స్ లో తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ స్ట్రీమింగ్ అవనుంది. ఫ్యామిలీతో సరదాగా సినిమా చూస్తూ ఎంజాయ్ చేయవచ్చు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!