

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 సినిమా థియేటర్లలో ప్రభంజనం సృష్టిస్తోంది. బోయపాటి శ్రీను – బాలయ్య కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రం డిసెంబర్ 12 న విడుదలై, కేవలం మూడు రోజుల్లోనే రూ.100 కోట్ల కలెక్షన్లు దాటినట్లు సమాచారం. హిందూ ధర్మం, మత సామరస్యం, ఆధ్యాత్మికత వంటి అంశాల నేపథ్యంలో కథ సాగడంతో ప్రేక్షకులు ఆసక్తిగా థియేటర్లకు తరలివస్తున్నారు.
చిన్నా పెద్దా అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులు టికెట్లు కొనుగోలు చేసి సినిమాను తిలకిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ఈ మూవీలో మాస్ మసాలాను బలంగా దంచేశారు. థియేటర్లలో భారీ విజయాన్ని సాధిస్తున్న అఖండ 2 ను త్వరలోనే ఓటీటీలో విడుదల చేయనున్నట్లు టాక్. సంక్రాంతి కానుకగా జనవరి రెండో వారంలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు. ఆ సమయంలో విడుదలైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!