

ఓటిటీలో థ్రిల్లర్ లేక హారర్ సినిమాలను ఎక్కువగా చూస్తుంటారు. అందుకే ఎప్పటికప్పుడు కొత్తగా, భిన్నంగా ఉన్న హారర్ మూవీస్ వస్తూనే ఉంటాయి. తెలుగులో కూడా వివిధ భాషల్లో వచ్చిన ఈ జానర్ సినిమాలు హిట్ ఫార్ములానే మారాయి.
ఇక ఈ ఏడాది జూన్‌లో విడుదలైన మరాఠీ హారర్ సినిమా ‘జారన్’ ఇప్పుడు తెలుగులో అందుబాటులోకి వచ్చింది. ‘జారన్’ అనే టైటిల్‌కు మరాఠీలో అర్థం “చేతబడి”. పేరుకి తగ్గట్టుగానే ఈ సినిమా మొత్తం బ్లాక్ మ్యాజిక్ (చేతబడి) నేపథ్యంలోని భయానక సన్నివేశాలతో నిండిపోయి ఉంటుంది.
ఈ సినిమా మొదట జూన్‌లో థియేటర్లలో విడుదలై, ఆగస్టులో ZEE5 ఓటీటీలో హిందీలో స్ట్రీమింగ్ అయింది. ఇప్పుడు తెలుగు డబ్బింగ్‌తో కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మేరకు మేకర్స్ అధికారిక పోస్టర్‌ను విడుదల చేశారు.
సైకలాజికల్ హారర్ సినిమాలను ఇష్టపడేవారికి ‘జారన్’ తప్పక చూడదగిన చిత్రం.
కథ విషయానికి వస్తే -
రాధ (అమృత సుభాష్) అనే మహిళకు భర్త, కుమార్తె ఉంటారు. ఆమె జీవితం సాధారణంగా ఉన్నప్పటికీ ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతత, సంతోషం ఉండదు. కారణం? ఎవరో ఆమె కుటుంబంపై చేతబడి (బ్లాక్ మ్యాజిక్) చేశారు. రాధ చిన్నప్పటి నుంచే ఈ సమస్యతో బాధపడుతూ ఉంటుంది.
చివరికి ఎవరు ఆమెపై ఈ చేతబడి చేశారు? ఎందుకు చేశారు? ఆమె కుటుంబానికి ఉన్న ఆ పగ వెనుక రహస్యం ఏమిటి? — ఇదే ఈ హారర్ థ్రిల్లర్‌లోని అసలు కథ.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!