

ఓటీటీలోకి ప్రతి వారం కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఆ క్రమంలో గత వారం తమిళ బోల్డ్ మూవీ 'హాట్‌స్పాట్ 2 మచ్' ఏకంగా ఆరు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో ఒకేసారి విడుదలైంది. అయితే, అప్పటివరకు ఒరిజినల్ వెర్షన్ మాత్రమే అందుబాటులో ఉండగా, ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల కోసం డబ్బింగ్ వెర్షన్‌ను తీసుకొస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా, ఈ నెల 27(శుక్రవారం) నుంచి ఆహా ఓటీటీలో తెలుగులో స్ట్రీమింగ్ కానుంది.
ఈ చిత్రానికి ఇది సీక్వెల్ కాగా, తొలి భాగం 2024లో విడుదలైంది. సీక్వెల్లో ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో మూడు బోల్డ్ కథలను చూపించారు. ఫ్యాన్ వార్స్, డ్రస్సింగ్ సెన్స్, నిజమైన ప్రేమ వంటి అంశాలను షాకింగ్‌గా ప్రెజెంట్ చేశారు. తమిళంలో మంచి రెస్పాన్స్ పొందిన ఈ సినిమా, ఇప్పుడు తెలుగులో కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందనే అంచనాలు ఉన్నాయి.
కథ విషయానికి వస్తే... శిల్ప అనే యువతి ఓ నిర్మాతను కలిసి మూడు కథలు చెబుతుంది. మొదటి కథ హీరోలను అతి అభిమానించే ఇద్దరు కుర్రాళ్ల గురించి, రెండో కథ డ్రస్సింగ్ సెన్స్ పై, మూడోది టైమ్ ట్రావెల్ ప్రేమకథ. ఈ మూడు కథలు ఒకదానికొకటి మించి ఆసక్తికరంగా ఉంటాయి. అసలు శిల్ప ఎవరు? ఆమె ఈ నిర్మాత దగ్గరకు ఎందుకు వచ్చింది? ఈ కథలు చెప్పడం వెనక ఉద్దేశం ఏమిటి? అన్నదే ఈ సినిమా కథ.








.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!