

పలాసా, శ్రీదేవి సోడా సెంటర్, మట్కా చిత్రాల తర్వాత దర్శకుడు కరుణ కుమార్ తెరకెక్కించిన డార్క్ సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘హనీ’ త్వరలో ఓటీటీలోకి రానుంది. ఫిబ్రవరి 6న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం నెలరోజులు కూడా పూర్తికాకముందే స్ట్రీమింగ్కు సిద్ధమైంది. నవీన్ చంద్ర, దివ్య పిళ్లై ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రాన్ని ఓవా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రవి పీట్ల, ప్రవీణ్ కుమార్ రెడ్డి నిర్మించారు.
ఈ సినిమా ఫిబ్రవరి 27 నుంచి SUN NXTలో తెలుగుతో పాటు తమిళ్ వెర్షన్లో స్ట్రీమింగ్ కానుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా విడుదల కానున్నట్లు సమాచారం. క్షుద్రపూజలు, మూఢనమ్మకాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం కథాపరంగా ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, రెండో భాగం కొంతమంది ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేదనే విమర్శలు వచ్చాయి. అయితే, ఆనంద్ పాత్రలో నవీన్ చంద్ర నటనకు మంచి ప్రశంసలు లభించాయి.
కథలో ఆనంద్ అనే వ్యక్తి మూఢనమ్మకాల పట్ల అతిగా ఆకర్షితుడై, తన కుటుంబాన్ని ఊరికి దూరంగా ఉన్న బంగ్లాకు తీసుకెళ్తాడు. అక్కడ క్షుద్రపూజల ద్వారా తన కోరికలు నెరవేరుతాయని నమ్ముతాడు. భార్య లలిత, కూతురు మీరా భయంతో జీవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆనంద్ చర్యలు చివరికి ఎలాంటి పరిణామాలకు దారి తీశాయి? రవణ, సారంగపాణి పాత్రల ప్రాధాన్యత ఏంటి? అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.







.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!