

బాక్సాఫీస్‌లో మంచి విజయాన్ని సాధించిన ఏక్ దీవానే కీ దీవానియత్ సినిమా డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టిన ఈ చిత్రాన్ని మిలాప్ జవేరి దర్శకత్వం వహించారు. హర్షవర్ధన్ రాణే మరియు సోనమ్ బజ్వా జంటగా నటించగా, మ్యూజికల్ సీక్వెన్స్‌లు మరియు ఆకర్షణీయమైన కథాంశం ప్రేక్షకులను మరింత ఆకట్టుకున్నాయి.
సినిమా కథ: విక్రమాదిత్య భోస్లే (హర్షవర్ధన్ రాణే) ఒక రాజకీయ నాయకుడు. అదా (సోనమ్ బజ్వా) బాలీవుడ్ నటి. మొదటి చూపులోనే విక్రమాదిత్య అదాను ఇష్టపడతాడు, కానీ అతడి ప్రవర్తన ఆమెకు నచ్చదు. ఇద్దరి మనస్తత్వాలు వేర్వేరు కావడం ప్రధాన సమస్యగా మారుతుంది. అదాకు నచ్చే విధంగా విక్రమాదిత్య తనను తాను మార్చుకున్నాడా? ఆమెను పెళ్లి చేసుకున్నాడా? అన్నది ఈ సినిమా కథాంశం. మ్యూజికల్‌గానూ ఈ మూవీ హిందీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమా ‘Zee 5’ ప్లాట్‌ఫారమ్‌లో ఈ నెల 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!