
సినిమాలు

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, యువ నటి మమితా బైజు జంటగా నటించిన “కర” సినిమా నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలైంది. విఘ్నేష్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో కేఎస్ రవికుమార్, జయరామ్ కీలక పాత్రల్లో నటించగా, జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
సుమారు 140 కోట్ల రూపాయల వ్యయంతో రూపొందిన ఈ సినిమాకు విడుదలకు ముందే అడ్వాన్స్ బుకింగ్‌లలో భారీ స్పందన వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ దక్కించుకున్నట్లు సమాచారం. థియేటర్లలో ప్రదర్శన పూర్తైన తర్వాత ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!