

ఈ వారం ఓటీటీల్లో పలు తెలుగు సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వచ్చాయి. దుల్కర్ సల్మాన్ నటించిన “కాంత”, అల్లరి నరేశ్ “12A రైల్వే కాలనీ”, అలాగే బ్రాట్, ఆరోమలే వంటి డబ్బింగ్ చిత్రాలు, త్రీ రోజెస్ సీజన్ 2 వెబ్ సిరీస్ ఇప్పటికే విడుదలయ్యాయి. ఇప్పుడు వీటితో పాటు మరో తెలుగు హారర్ మూవీ “చెరసాల” కూడా సడన్‌గా ఓటీటీలోకి వచ్చింది.
శ్రీజిత్, నిష్కల, రమ్య ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఈ ఏడాది ఏప్రిల్ 11న థియేటర్లలో విడుదలైంది. చిన్న బడ్జెట్ చిత్రం కావడం, పెద్దగా పేరున్న నటులు లేకపోవడంతో రిలీజ్ సమయంలో ఎక్కువగా గుర్తింపు పొందలేదు. ఇప్పుడు సుమారు ఎనిమిది నెలల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియోలో అద్దె విధానంలో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది.
కథ విషయానికి వస్తే — వంశీ (శ్రీజిత్) మరియు ప్రియ (నిష్కల) కాలేజీ స్టూడెంట్స్. వీరిద్దరూ కాలేజీ రోజుల్లో ప్రేమలో పడతారు కానీ బయటకు చెప్పుకోరు. చదువులు పూర్తయ్యాక స్నేహితులతో కలిసి ఓ ట్రిప్‌కి వెళ్లి ఒక పాత బంగ్లాలో ఉంటారు. కానీ ఆ బంగ్లాలో ఓ ప్రేతాత్మ ఉంటుంది. ఆ ఆత్మ ఎందుకు ఉంది? దాని వల్ల వీరికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతాయి? చివరికి వంశీ, ప్రియ ఆ బంగ్లా నుంచి ఎలా బయటపడతారు? అనే సస్పెన్స్‌తో సినిమా సాగుతుంది.






.webp&w=3840&q=75)













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!