

ఇప్పుడంతా ఓటీటీ కాలం. థియేటర్లలో విడుదలైన కొన్ని రోజులకే సినిమాలు స్ట్రీమింగ్‌లోకి వస్తున్నాయి. మలయాళ యాక్షన్ సినిమా ‘చథా పచ్చ’ కూడా అదే దారిలో నడుస్తోంది. ఈ సినిమా ఈ నెల (ఫిబ్రవరి) 13 న థియేటర్లలో విడుదలైంది. అయితే కేవలం ఆరు రోజులకే, ఈ నెల (ఫిబ్రవరి) 19 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
ఈ చిత్రం గత నెల 22 న మలయాళంలో విడుదలైంది. ఇందులో అర్జున్ అశోకన్, రోషన్ మ్యాథ్యూ, ఇషాన్ సౌకత్ ప్రధాన పాత్రలు పోషించారు. దర్శకుడు అద్వైత్ నాయర్. తొలుత ఈ సినిమాను తెలుగులో జనవరిలోనే విడుదల చేయాలని భావించారు, కానీ వాయిదా వేసి ఈ నెల (ఫిబ్రవరి) 13 న విడుదల చేశారు. ఇప్పుడు ఈ నెల (ఫిబ్రవరి) 19 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
కథ విషయానికి వస్తే, ముగ్గురు అన్నదమ్ములు సవి (అర్జున్ అశోకన్), లిటిల్ (ఇషాన్ షౌకత్), వెట్రి (రోషన్ మ్యాథ్యూ) చిన్నప్పటి నుంచి టీవీలో రెజ్లింగ్ పోటీలు చూస్తూ పెరుగుతారు. కొన్ని కారణాల వల్ల వారు విడిపోతారు. తర్వాత సవి, లిటిల్ కొచ్చిలో కాస్ట్యూమ్ రెజ్లింగ్ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. వెట్రి ఎందుకు దూరంగా ఉన్నాడు? వారి రెజ్లింగ్ పోటీ విజయవంతమైందా? వారు ఎదుర్కొన్న సవాళ్లు ఏమిటి? అన్నదే మిగతా కథ.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!