

బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ధురంధర్ సినిమా భారీ విజయాన్ని సాధించింది. ఊహించని స్థాయిలో వసూళ్లు రాబడుతూ రోజురోజుకూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. మంచి మౌత్ టాక్తో ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షిస్తూ డిసెంబర్ 5 న విడుదలైన ఈ సినిమా ఇప్పటికీ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో కథ మొత్తం కరాచీ అండర్ వరల్డ్ నేపథ్యంలో సాగుతుంది. ISI మరియు అండర్ వరల్డ్ మధ్య జరిగే కీలక సంఘటనల చుట్టూ కథ నడుస్తుంది.
థియేటర్లలో సినిమా ఇంకా ఆడుతున్నప్పటికీ, ఓటీటీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా డిజిటల్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. 2026 జనవరి 30 న ఓటీటీలో విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. హిందీతో పాటు తెలుగులో కూడా విడుదల చేసే అవకాశం ఉండటంతో తెలుగు ప్రేక్షకుల్లోనూ ఆసక్తి పెరిగింది. రణవీర్ సింగ్ నటన సినిమాకు ప్రధాన బలంగా నిలిచిందని ఇప్పటికే పలువురు ప్రశంసలు కురిపించారు. మాధవన్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ కీలక పాత్రల్లో నటించారు. థియేటర్లలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ధురంధర్, ఓటీటీలో ఏ రేంజ్ లో విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!