

ఇంటర్నేషనల్ అవార్డులతో సంచలనం రేపిన బోల్డ్ అండ్ కాంట్రవర్సీ మూవీ బ్యాడ్ గర్ల్ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. టీజర్ విడుదలతోనే ఈ చిత్రం పెద్ద వివాదానికి దారితీసింది. ఇందులోని కొన్ని సన్నివేశాలు సమాజంలోని ఓ వర్గాన్ని కించపరిచేలా ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దీంతో సెన్సార్ బోర్డు కూడా రిలీజ్కు ముందు షాక్ ఇచ్చి, అభ్యంతరకరమైన సన్నివేశాలకు కత్తెర్లు వేసింది.
ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ కాకపోయినా, యువతలో ఈ సినిమా మంచి స్పందన తెచ్చుకుంది. కథలో రమ్య అనే అమ్మాయి ప్రేమలో పడుతూ, బ్రేకప్లతో ఎదుర్కొన్న భావోద్వేగ పరిస్థితిని చూపిస్తుంది. ఆమెపై “బ్యాడ్ గర్ల్” అనే ముద్ర ఎందుకు పడింది? అనేది సినిమాలోని ప్రధాన అంశం.
ప్రముఖ దర్శకులు వెట్రిమారన్, అనురాగ్ కశ్యప్ నిర్మించిన ఈ సినిమాకు వర్ష భరత్ దర్శకత్వం వహించారు. అంజలి శివరామన్ ప్రధాన పాత్రలో నటించగా, శరణ్య రవిచంద్రన్ ముఖ్య పాత్ర పోషించింది. థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన ఈ మూవీ ఇప్పుడు జియో హాట్ స్టార్లో నవంబర్ 4 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తమిళంతో పాటు తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులోకి రానుంది.













కామెంట్స్ (3)
Let’s see how the movie is.
Let’s see how the movie is.
Controversy adds curiosity