
న్యూస్

రామ్ పోతినేని నటించిన తాజా చిత్రం ఆంధ్ర కింగ్ తాలూకా బాక్సాఫీస్‌లో మంచి రెస్పాన్స్ సంపాదించింది. మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా, కథనం మరియు నటనకు మంచి స్పందన లభించింది. రామ్ పర్ఫార్మెన్స్ కు ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ దక్కింది.
ఇప్పుడు ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమవుతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్‌ను పొందింది మరియు డిసెంబర్ 25 న క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేయనుంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా అందుబాటులో ఉంటుంది.
ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించగా, ఉపేంద్ర కీలక పాత్రలో నటించారు. వివేక్-మెర్విన్ సంగీతం అందించగా, మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మించారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!