

హాలీవుడ్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న ‘అనకొండ’ సినిమా అకస్మాత్తుగా ఓటీటీలోకి రావడం ఆసక్తిని కలిగిస్తోంది. అసలు ఈ సినిమా ఎందుకు ఇప్పుడు స్ట్రీమింగ్‌లోకి వచ్చింది? ఏ ప్లాట్ఫామ్లో అందుబాటులో ఉంది? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
1997లో తొలిసారి ‘అనకొండ’ సినిమా వెండితెరపై విడుదలైంది. అప్పటివరకు పాములను ప్రధానంగా తీసుకుని ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా ఉండేవి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఈ సినిమాను విరగబడి చూశారు. తెలుగులో డబ్బింగ్ వెర్షన్ కూడా విడుదలై మంచి విజయాన్ని సాధించింది. దీని తర్వాత 2004లో ‘ది హంట్ ఫర్ బ్లడ్ ఆర్కిడ్’, 2008లో ‘ఆఫ్ స్ప్రింగ్’, 2009లో ‘ట్రయల్ ఆఫ్ బ్లడ్’, 2015లో ‘లేక్ ప్లాసిడ్’ వంటి మరో నాలుగు సినిమాలు వచ్చాయి. ఇవి వాణిజ్యంగా హిట్ అయినప్పటికీ, కథ పరంగా మాత్రం సగటు స్థాయిలోనే నిలిచాయి.
దాదాపు పదేళ్ల విరామం తర్వాత గత నెల ‘అనకొండ’ పేరుతో లేటెస్ట్ మూవీ ఒకటి విడుదలైంది. దీనికి తెలుగు డబ్బింగ్ కూడా విడుదల చేశారు. అయితే ఈ సినిమా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో నెల రోజులు కూడా కాకముందే అద్దె విధానంలో అమెజాన్ ప్రైమ్ వీడియోలోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం విదేశాల్లో ఇంగ్లీష్ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతోంది. ఈ నెల 29 నుంచి మన దగ్గర కూడా తెలుగు, తమిళ డబ్బింగ్ వెర్షన్లు ఓటీటీలో అందుబాటులోకి రానున్నాయని సమాచారం.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!