

ఆది పినిశెట్టి హీరోగా నటించిన తాజా చిత్రం డ్రైవ్ ఎలాంటి ముందస్తు ప్రచారం లేకుండానే ఓటీటీలోకి వచ్చేసింది. డిసెంబర్ 12 న అఖండ-2తో పాటు ఈ సినిమా విడుదలైంది. చాలా కాలం తర్వాత ఆది పినిశెట్టి తెలుగులో సింగిల్ హీరోగా నటించడం విశేషం. భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించగా, జెనూస్ మొహమ్మద్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో మలయాళ నటి మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్గా నటించారు.
డ్రైవ్ సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ సినిమా రన్ టైమ్ కేవలం 1 గంట 47 నిమిషాలే. థియేటర్లలో ఈ మూవీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయినా, ఓటీటీలో మాత్రం మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. సైబర్ క్రైమ్స్, హ్యాకింగ్ నేపథ్యంతో రూపొందిన ఈ సినిమాకు సీక్వెల్‌ను కూడా మేకర్స్ ప్రకటించారు. ఓటీటీ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!