

ప్రముఖ ఓటీటీ వేదిక జియో హాట్‌స్టార్ కొత్త సినిమాలు, వెబ్‌సిరీస్‌ల జాబితాను అధికారికంగా ప్రకటించింది. మంగళవారం జరిగిన ‘సౌత్ అన్బౌండ్’ కార్యక్రమంలో కమల్ హాసన్, మోహన్‌లాల్, నాగార్జున వంటి స్టార్లు పాల్గొన్నారు.
జియో హాట్‌స్టార్ పలు భారీ ప్రాజెక్ట్‌లు త్వరలో స్ట్రీమింగ్కు రానున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా కొత్త సిరీస్ ‘ఫార్మా’ డిసెంబర్ 19 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అదనంగా, ప్రేక్షకాదరణ పొందిన మరికొన్ని సిరీస్‌ల సీజన్లు మరియు కొత్త ప్రాజెక్ట్‌లు కూడా ప్రకటించారు.
ప్రముఖంగా రానున్న శీర్షికలు:
కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ 3
కజిన్స్ అండ్ కల్యాణమ్స్
అనాలీ
రాస్లిన్
1000 బేబీస్ సీజన్ 2
విక్రమ్ ఆన్ డ్యూటీ
వరమ్
బ్యాచ్ మేట్స్
సేవ్ ది టైగర్స్ సీజన్ 3
మొత్తంగా 18 కొత్త ప్రాజెక్ట్‌లను ఈవెంట్లో జియో హాట్‌స్టార్ పరిచయం చేసింది. వీటిలో పలు కొత్త వెబ్‌సిరీస్‌లు, అలాగే ఇప్పటికే హిట్ అయిన సిరీస్‌ల సీక్వెల్స్ కూడా ఉన్నాయి. వాటికి సంబంధించిన ప్రోమోలు కూడా విడుదల చేశారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!