

ఈ ఏడాది లో రెండు నెలలు పూర్తయిపోయాయి. మార్చి వచ్చేసింది. అలానే కొత్తవారం కూడా మొదలైంది. ఈ వీకెండ్ థియేటర్లలోకి మృత్యుంజయ్, సరస్వతి, సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని, చైనా పీస్, కాక్రోచ్, మెన్షన్ హౌస్ మల్లేష్, సతీ లీలావతి తదితర తెలుగు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి.
మరోవైపు ఓటీటీ మాధ్యమాల్లో కూడా 13 కు పైగా కొత్త సినిమాలు, సిరీస్లు ప్రసారం కానున్నాయి. వీటిలో తెలుగు సినిమా ఓం శాంతి శాంతి శాంతిః, అలాగే తెలుగు డబ్బింగ్ చిత్రాలు విత్ లవ్, గాంధీ టాక్స్ ఉన్నాయి. రవితేజ నటించిన భర్త మహాశయులకు విజ్ఞప్తి కూడా ఈ వారం ఓటీటీలో ప్రసారం కావచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ వారం (మార్చి 2 – 8) ఓటీటీల్లో విడుదలయ్యే చిత్రాలు:
నెట్ఫ్లిక్స్: విత్ లవ్ (మార్చి 6), హలో బచ్చోన్ (మార్చి 6), వార్ మెషీన్ (మార్చి 6)
అమెజాన్ ప్రైమ్: తన్వి ద గ్రేట్ (మార్చి 3), యంగ్ షెర్లాక్ (మార్చి 4), సుబేదార్ (మార్చి 5)
హాట్స్టార్: విక్రమ్ ఆన్ డ్యూటీ (మార్చి 6)
ఆహా: ఓం శాంతి శాంతి శాంతిః (మార్చి 4)
సోనీ లివ్: లాలో కృష్ణ సదా సహాయతే (మార్చి 6)
సన్ నెక్స్ట్: డియర్ రథి (మార్చి 6), గ్రానీ (మార్చి 6)
జీ5: గాంధీ టాక్స్ (మార్చి 6), జబ్ కూలీ కితాబ్ (మార్చి 6)
మొత్తంగా ఈ వారం ఓటీటీ ప్రేక్షకులకు, థియేటర్ అభిమానులకు వినోదభరితమైన వారం కానుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!