
న్యూస్
హైదరాబాద్లో iBomma వెబ్సైట్ వ్యవస్థాపకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిన్న ఫ్లైట్లో వచ్చిన ఆ వ్యక్తిని కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం.
ప్రాథమిక దర్యాఫ్తు ప్రకారం, ఆయన కరీబియన్ దేశంలో ఉంటూ iBomma ను నిర్వహిస్తున్నట్లు విచారణలో బయటపడింది. అదేవిధంగా అక్రమ స్ట్రీమింగ్ ద్వారా రూ. 3 కోట్లకు పైగా ఆదాయం సంపాదించినట్లు అధికారులు గుర్తించారు.
సినిమాలను చట్టవిరుద్ధంగా అప్లోడ్ చేసి వెబ్సైట్లో పెట్టడంపై నిర్మాతలు పలుమార్లు ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో, iBomma పై ప్రత్యేక దర్యాప్తు సాగుతోంది. అదుపులోకి తీసుకున్న వ్యక్తిని విచారించి మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!