

కన్నడ స్టార్ యష్ నటిస్తున్న టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ చిత్ర టీజర్ విడుదల తేదీ, సమయాన్ని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. రేపు ఉదయం 9:35 గంటలకు టీజర్ విడుదల కానుంది. తాజాగా విడుదల చేసిన పోస్టర్లో రక్తంతో నిండిన మంచు నేలపై నిలబడి ఉన్న యష్ లుక్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలు సృష్టిస్తోంది.
అయితే ఈ చిత్రం తాజాగా వివాదంలో చిక్కుకుంది. కొన్ని సన్నివేశాలు క్రైస్తవ మత భావాలను దెబ్బతీసేలా ఉన్నాయని నేషనల్ క్రిస్టియన్ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. సెయింట్ మైఖేల్‌కు సంబంధించిన దృశ్యాలపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, ఆ సన్నివేశాలను తొలగించాలని, ప్రమోషనల్ కంటెంట్‌ను నిలిపివేయాలని మరియు చిత్ర బృందం క్షమాపణ చెప్పాలని సంస్థ డిమాండ్ చేసింది. మార్చి 19న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రం ధురంధర్ పార్ట్ 2తో బాక్సాఫీస్ పోటీకి సిద్ధమవుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!