
క్రీడలు

రాకింగ్ స్టార్ యష్ నటిస్తున్న భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘టాక్సిక్’పై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తుండగా, నయనతార, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్, తారా సుతారియా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. డ్రగ్స్ మాఫియా నేపథ్యంతో రూపొందిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది.
అయితే విడుదలపై స్పష్టత లేకపోవడంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. కొన్ని కీలక సన్నివేశాలపై యష్ అసంతృప్తిగా ఉన్నారని, దాదాపు 100 రోజుల రీషూట్ ప్లాన్ చేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. విదేశీ పంపిణీ సమస్యలు కూడా కారణమని టాక్. దీంతో సినిమా విడుదల మరింత ఆలస్యం అవుతుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!