

ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో వచ్చిన బెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీలలో దృశ్యం ఒకటి. మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయాన్ని అందుకోగా, తర్వాత పలు భాషల్లో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
ఇప్పుడు మోహన్‌లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన దృశ్యం 3 మే 21న పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల కానుంది. అయితే తొలి రెండు భాగాలకు వచ్చిన క్రేజ్‌తో పోలిస్తే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో సినిమాపై అంతగా హైప్ కనిపించడం లేదనే చర్చ సాగుతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో లేవని సమాచారం. దీంతో వెంకటేష్‌తో తెలుగులో రీమేక్ చేసి ఉంటే ప్రేక్షకుల నుంచి మరింత బెటర్ రెస్పాన్స్ వచ్చేదేమో అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే సినిమా విడుదల తర్వాత పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!