

విభిన్న జానర్లు, పలు పరిశ్రమల్లోని అగ్రహీరోలు మరియు ప్రతిభావంతమైన దర్శకులతో కలిసి పనిచేసే అవకాశాలు రావడం తనకు అదృష్టమని ప్రముఖ నటి అన్నారు. మోహన్‌లాల్‌తో కలిసి ‘హృదయపూర్వం’, ప్రభాస్‌తో ‘రాజాసాబ్’ వంటి చిత్రాల్లో నటించడం పూర్తిగా భిన్నమైన అనుభవమని వెల్లడించారు. తమిళంలో ధనుష్, రజనీకాంత్‌లతో కలిసి పని చేయడం కెరీర్‌కు మరింత వెసులుబాటు ఇచ్చిందని చెప్పారు. పలు భాషలు మాట్లాడగలగడం వల్ల, ఓటీటీ మరియు సోషల్ మీడియా విస్తరణతో పరిశ్రమల మధ్య సరిహద్దులు తగ్గిపోయాయని, ఇకపై ఒకే పరిశ్రమకే పరిమితం కావాలనుకోవడం లేదని స్పష్టం చేశారు. మంచి సినిమా అయితే ఎక్కడ తయారైనదైనా ప్రేక్షకుల వరకు చేరుతుందనే నమ్మకం ఉందన్నారు.
చిన్నప్పటి నుంచే క్రీడల్లో చురుకుగా ఉండటం వల్ల శరీరం ఏ పాత్రకైనా అలవాటు పడుతుందని చెప్పారు. ఫ్యాషన్ విషయంలో ట్రెండ్లను అందంగా అనుసరించకుండా, సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. చేనేత చీరలు, నుదుటిపై బొట్టు, కళ్లకు కాటుకే తన దృష్టిలో నిజమైన ఫ్యాషన్ అని తెలిపారు. సినిమా రంగంలో విమర్శలు సహజమని, కెరీర్ ప్రారంభంలోనే వాటికి సిద్ధంగా ఉండాలని చెప్పారు. కారణం లేకుండా ట్రోలింగ్ చేసే వారిని పట్టించుకోనని, నటనతో పాటు ప్రయాణం, ఫోటోగ్రఫీ వంటి వ్యక్తిగత ఆసక్తులకు కూడా సమయం కేటాయిస్తానని వెల్లడించారు.








.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!