
టెక్నాలజీ

‘ఎల్లమ్మ’ సినిమాతో ప్రేక్షకులను ఒక కొత్త ప్రపంచానికి తీసుకెళ్లేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను రేపు సాయంత్రం 4:05 గంటలకు విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. విడుదలైన పోస్టర్‌ను చూస్తేనే సినిమా వాతావరణం గాఢంగా, ఆసక్తికరంగా ఉండబోతుందనే భావన కలుగుతోంది.
దిల్ రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఎల్లమ్మ’ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. గ్లింప్స్ విడుదలకు ముందే ఈ సినిమా సినీ ప్రేక్షకుల్లో మంచి హైప్‌ను సొంతం చేసుకుంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!