
ఆరోగ్యం

విక్రాంత్, చాందినీ చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన “సంతానప్రాప్తిరస్తు” నవంబర్ 14 న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. “ఏబీసీడీ”, “ఆహా నా పెళ్లంట” వంటి చిత్రాలతో పేరు తెచ్చుకున్న సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను మధుర ఎంటర్టైన్మెంట్, నిర్వి ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించాయి. వెన్నెల కిషోర్, తరుణ్ భాస్కర్, అభినవ్ గోమాతం తదితరులు ముఖ్యపాత్రల్లో నటించారు. తాజాగా తరుణ్ భాస్కర్ ఈ చిత్రాన్ని ప్రశంసిస్తూ, సంతానలేమి వంటి సున్నితమైన అంశాన్ని సరదాగా, హృదయానికి హత్తుకునేలా చూపించారని అన్నారు. తెలుగు నేటివ్ టచ్‌తో నవ్వులు, భావోద్వేగాలు కలిపిన హృదయానందకరమైన సినిమా అని అభివర్ణించారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!