
జనరల్

దృశ్యం 3పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మోహన్‌లాల్, అజయ్ దేవ్గన్ కలిసి ఒకే సినిమాలో కనిపిస్తారా అన్న చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది.
అయితే దర్శకుడు అభిషేక్ పాఠక్ ఈ క్రాస్ఓవర్ ప్రస్తుతం ప్లాన్‌లో లేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో అవకాశం పరిశీలించవచ్చని మాత్రమే తెలిపారు. మలయాళంలో మోహన్‌లాల్‌తో ప్రారంభమైన ఈ ఫ్రాంచైజ్ హిందీలో అజయ్ దేవ్గన్తో రీమేక్ అయి పెద్ద విజయాన్ని సాధించింది. మలయాళ వెర్షన్ మే 21న విడుదల కానుండగా, హిందీ వెర్షన్ ఈ ఏడాది చివర్లో రానుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!