

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ 2 మిక్స్‌డ్ రివ్యూలతో విడుదలైంది. అయితే విడుదలైన మొదటి రోజున సినిమా మంచి ఓపెనింగ్‌ను నమోదు చేసింది. తెలుగు వెర్షన్‌లో తొలి రోజు సుమారు రూ. 22 కోట్ల నెట్ కలెక్షన్లు సాధించింది. అయితే రెండో రోజుకు వచ్చేసరికి వసూళ్లలో తగ్గుదల కనిపించింది. రెండో రోజు తెలుగు వెర్షన్ కలెక్షన్లు సుమారు రూ. 15 కోట్ల నెట్‌గా నమోదయ్యాయి.
బీ, సీ సెంటర్లలో సినిమా ఆశించిన స్థాయిలో నడుస్తుండగా, ఇది బాలకృష్ణకు బలమైన మార్కెట్ కావడం విశేషం. నార్త్ అమెరికాలో తొలి రోజు సుమారు 6 లక్షల డాలర్ల వసూళ్లు సాధించిన అఖండ 2, రెండో రోజు అక్కడ కూడా తగ్గుదల చూపింది. అదే సమయంలో దురంధర్ సినిమా అక్కడ మంచి ప్రదర్శన ఇస్తోంది. భారీ బడ్జెట్ కారణంగా ఆదివారం కలెక్షన్లు కీలకమని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్‌పై భారీ అంచనాలు ఉన్నప్పటికీ, ఈసారి ప్రేక్షకులను పూర్తిగా మెప్పించలేకపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.




















కామెంట్స్ (1)
🔥🔥