

రాజా సాబ్ ఓటిటి విడుదల అనంతరం ట్రోలింగ్ మరింత తీవ్రస్థాయికి చేరింది. సాధారణంగా హై స్టాండర్డ్ ఓటిటి ప్లాట్‌ఫామ్‌లలో స్క్రీన్ షాట్లు, క్లిప్స్ వైరల్ చేయడం కష్టం అయినా, పైరసీ సైట్ల నుంచి హెచ్డీ ప్రింట్లు డౌన్లోడ్ చేసుకుని దర్శకుడు మారుతీని టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో విస్తృతంగా విమర్శలు వ్యక్తమయ్యాయి. డూప్ వాడకం, కంటిన్యుటీ తప్పులు, లాజిక్ లేని సన్నివేశాలపై నెటిజన్లు పోస్ట్‌మార్టం చేయడం మొదలుపెట్టారు.
అయితే అసలు సమస్య ట్రోలింగ్ కంటే ముందు ఏర్పడిన అతి భారీ అంచనాలే. గతంలో లైగర్, ఆచార్య, గేమ్ ఛేంజర్ లాంటి భారీ పరాజయాలు వచ్చినా, రాజా సాబ్ ఎదుర్కొన్న స్థాయి విమర్శలు ఎదురవ్వలేదు. విడుదలకు ముందు మారుతీ, ఎస్కెఎన్ ఇచ్చిన అతిగా ఉన్న ఎలివేషన్ల వల్ల అభిమానుల అంచనాలు ఆకాశాన్ని తాకాయి. దీనికి భిన్నంగా సలార్, కల్కి సినిమాల సమయంలో దర్శకులు ప్రశాంతంగా ఉండగా కంటెంట్ విజయాన్ని తెచ్చింది. హైప్‌కు కంటెంట్ సరిపోకపోవడమే రాజా సాబ్ ట్రోలింగ్‌కు ప్రధాన కారణమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!