

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలు సృష్టిస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. తాజాగా విడుదలైన ట్రైలర్లో జాన్వీ కనిపించిన తీరు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. పల్లెటూరి అమ్మాయి పాత్రలో ఆమె పూర్తిగా ఒదిగిపోవడానికి చేసిన ప్రయత్నం ప్రేక్షకులను ఆకట్టుకుంటోందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆమె లుక్, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్ చూసిన చాలామందికి ‘రంగస్థలం’లో సమంత పాత్ర గుర్తుకు వస్తోందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
అయితే ప్రశంసలతో పాటు కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా భావోద్వేగ సన్నివేశాల్లో నటన మరింత బలంగా ఉండాల్సిందని కొందరు చెబుతున్నారు. తెలుగు డైలాగ్ డెలివరీపై కూడా చర్చ జరుగుతోంది. అయినప్పటికీ జాన్వీ స్క్రీన్ ప్రెజెన్స్ మాత్రం మంచి మార్కులు కొట్టేస్తోందని అభిమానులు అంటున్నారు. ‘ఉప్పెన’ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం, గ్రామీణ నేపథ్యం, రామ్ చరణ్ మాస్ ఇమేజ్ ఈ సినిమాకు ప్రధాన బలాలుగా కనిపిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!