

విజయ్ దేవరకొండ–రష్మిక మందన్న రిలేషన్షిప్ ఇప్పటికే టాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో వచ్చిన ఫోటోలు, స్టేటస్లు అనేక సార్లు వారి బంధాన్ని సూచించినా, ఇద్దరూ మాత్రం అధికారికంగా ఎప్పుడూ రివీల్ చేయలేదు. ఇటీవల అక్టోబర్‌లో వీరి ఎంగేజ్మెంట్ జరిగిందన్న వార్తలు వైరల్ అయ్యాయి. విజయ్ సన్నిహిత వర్గాలు కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారన్న టాక్ వచ్చింది. అయినా కూడా ఇద్దరూ ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు.
రష్మిక ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో “విజయ్ లాంటి వ్యక్తినే పెళ్లి చేసుకుంటాను” అని చెప్పినా, ఎంగేజ్మెంట్ గురించి మాత్రం మౌనం పాటించింది. 'ది గర్ల్ ఫ్రెండ్' సక్సెస్ మీట్లో విజయ్ దేవరకొండ చీఫ్ గెస్ట్‌గా రావడం, స్టేజ్‌పై రష్మికను “రషి” అని పిలవడం, ఆమె చేతిపై కిస్ చేయడం వంటి క్యూట్ మూమెంట్స్ వైరల్ అయ్యాయి. అయినా కూడా తమ పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే ఇప్పుడు అభిమానుల్లో మరింత క్యూరియాసిటీ పెంచుతోంది. ఇదిలా ఉండగా, రష్మిక ఇటీవల ఉదయ్‌పూర్ వెళ్లి వివాహ వేదికలను పరిశీలించినట్లు సమాచారం. అందువల్ల బ్యాక్‌డోర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ ఏర్పాట్లు జరుగుతున్నాయన్న టాక్ బలపడుతోంది. అధికారిక ప్రకటన ఎప్పుడు చేస్తారో ఇప్పుడు అందరి దృష్టి అక్కడే ఉంది.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!