

తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నటుడు విజయ్ను దర్శకుడు వెంకట్ ప్రభు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘ది గోట్’ సినిమాలో ఉపయోగించిన ఐకానిక్ నంబర్ ప్లేట్ ‘TN07 CM 2026’ను ప్రత్యేక బహుమతిగా విజయ్‌కు అందించారు. ఈ నంబర్ ప్లేట్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 2024లో విజయ్ ‘తమిళగ వెట్రి కజగం’ పార్టీని స్థాపించిన తర్వాత విడుదలైన ఈ సినిమాలో అదే నంబర్ ప్లేట్ కనిపించడంతో, అప్పట్లోనే విజయ్ సీఎం అవుతారనే సంకేతమని అభిమానులు భావించారు.
వెంకట్ ప్రభు ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ “మన సీఎం విజయ్ అన్నను కలవడం ఆనందంగా ఉంది. ఇది కేవలం ఆరంభం మాత్రమే” అని పేర్కొన్నారు. ఇటీవల చెన్నైలో జరిగిన భారీ సభలో విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు విజయ్ నటిస్తున్న చివరి చిత్రం ‘జననాయకన్’ 2026 ఆగస్టులో విడుదలయ్యే అవకాశముందని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం ఈ గిఫ్ట్ మరియు నంబర్ ప్లేట్ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!