

గతంతో పోలిస్తే సినిమాల ఎంపికలో మరింత సెలెక్టివ్‌గా మారిన సమంత, ఇటీవల ‘శుభం’ సినిమాతో నిర్మాతగా కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఆడియెన్స్‌ను మెప్పించిన ఈ చిత్రంలో కీలక పాత్రలో కూడా నటించిన ఆమె, ప్రస్తుతం ‘మా ఇంటి బంగారం’ చిత్రంతో మళ్లీ బిజీగా మారింది. ఈ మూవీకి నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా కొంతకాలం గ్యాప్ తీసుకున్న సమంత, ఇప్పుడు పూర్తిగా కోలుకుని తిరిగి షూటింగ్స్‌లో పాల్గొంటోంది.
ఇదిలా ఉండగా, ఇటీవలే బాలీవుడ్ దర్శకుడు నిడిమోరును వివాహం చేసుకున్న సమంత, పెళ్లి తర్వాత కూడా సినిమాలపై ఫోకస్ కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో సమంతకు సంబంధించిన ఓ పాత వీడియో వైరల్‌గా మారింది. అందులో ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబుపై చేసిన ప్రశంసలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మహేష్ బాబు ఇండియాలోనే అత్యంత హ్యాండ్సమ్ హీరో అంటూ, ఆయన పక్కన తాను బాగా కనిపించేందుకు ఎంతో జాగ్రత్తలు తీసుకున్నానని సమంత చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!