

నాలన్ కుమారస్వామి దర్శకత్వంలో తెరకెక్కుతున్న వా వాథియార్ చిత్రంలో కార్తి హీరోగా నటిస్తున్నాడు. కృతి శెట్టీ హీరోయిన్గా, సత్యరాజ్, రాజ్‌కిరణ్, ఆనందరాజ్, శిల్పా మంజునాథ్, కరుణాకరన్, జీఎం సుందర్, వదివుకరసి, మధుర్ మిట్టల్ తదితరులు కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 2025 లో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. వరుసగా ప్రభావవంతమైన సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న కార్తి ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచుతున్నాడు.
తెలుగు ప్రేక్షకుల కోసం ప్రత్యేకంగా, ఈ చిత్రాన్ని అన్నగారు వస్తారు అనే టైటిల్‌తో ఒకేసారి తెలుగు భాషలో కూడా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. కార్తి ఉన్న ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ అప్డేట్ను పంచుకున్నారు. కార్తికి తెలుగురాష్ట్రాల్లో ఉన్న బలమైన క్రేజ్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ ప్రకటన సినిమా పట్ల మరింత ఆసక్తిని పెంచింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!