

‘వృషకర్మ’ చిత్ర గ్లింప్స్ అధికారికంగా విడుదలై ప్రేక్షకులను మిథికల్ మరియు రహస్య ప్రపంచంలోకి ఆహ్వానించింది. ఇప్పటివరకు చూడని విధంగా రూపొందిన ఈ మిథికల్ థ్రిల్లర్ విశిష్ట దృశ్య వైభవంతో పాటు భావోద్వేగభరిత కథనాన్ని అందించనుంది. యువసామ్రాట్ నాగ చైతన్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని దర్శకుడు కార్తిక్ దండు తన ప్రత్యేక దృష్టితో తెరకెక్కిస్తున్నారు. గ్లింప్స్ విడుదలైన వెంటనే అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి, స్పర్శ్ శ్రీవాస్తవ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, ఎస్వీసీసీ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి అజనీష్ బి లోకనాథ్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. విభిన్న కాన్సెప్ట్, అద్భుత సాంకేతిక ప్రమాణాలతో ‘వృషకర్మ’ తెలుగు సినీ ప్రేక్షకుల కోసం అత్యంత ఆసక్తికర చిత్రంగా మారుతోంది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!