
రాజకీయాలు
.jpg&w=3840&q=75)
హైదరాబాద్‌లోని సారథి స్టూడియోస్‌లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య తెలుగు సినీ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల్లో ఆయన స్పష్టమైన ఆధిక్యంతో విజయం సాధించారు. వైస్ ప్రెసిడెంట్‌గా దర్శకుడు సముద్ర, ప్రధాన కార్యదర్శిగా రామారావు, ట్రెజరర్‌గా దర్శకుడు సాయి రాజేశ్ ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా మాట్లాడిన నూతన అధ్యక్షుడు వీఎన్ ఆదిత్య, దర్శకుల సంఘం అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సభ్యుల ఆరోగ్య భద్రత కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడతామని, సినిమా నిర్మాణానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని వెల్లడించారు. తమ ప్యానెల్ నుంచి పోటీ చేసిన 18 మందిలో 16 మంది విజయం సాధించారని పేర్కొంటూ, తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్న అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!