

ఎంటర్టైనర్గా రూపొందిన విష్ణు విన్యాసం బాక్సాఫీస్ వద్ద మంచి వేగంతో దూసుకెళ్తోంది. శ్రీ విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అనుకూల స్పందన లభిస్తోంది. యదునాథ్ మారుతీ రావు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా రెండో రోజునే 54 శాతం వసూళ్ల పెరుగుదల నమోదు చేయడం విశేషం. తొలి రోజు 31.2 వేల టికెట్లు అమ్ముడవగా, రెండో రోజు ఆ సంఖ్య 48.1 వేలకి పెరిగింది. కుటుంబ ప్రేక్షకులు, యువత మంచి ఆసక్తి చూపుతున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.
రెండు రోజుల్లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.9.10 కోట్ల గ్రాస్ వసూలు చేసి మంచి ఆరంభాన్ని సాధించింది. మూడో రోజు బుకింగ్స్ కూడా ఆశాజనకంగా ఉన్నట్లు సమాచారం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ నిర్మించిన ఈ చిత్రంలో నాయన సారిక హీరోయిన్గా నటించారు. విదేశాల్లో కూడా సినిమాకు మంచి స్పందన లభిస్తోంది.
పబ్లిక్ టాక్ అనుకూలంగా మారుతుండటంతో విష్ణు విన్యాసం బ్లాక్బస్టర్ దిశగా దూసుకెళ్తోందని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.











.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!