
గాసిప్స్

విజయ్ దేవరకొండ, రష్మికల వివాహం ఈ నెల 26న జరగనుందన్న ప్రచారం మధ్య వారి వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియాలో లీక్ కావడం చర్చనీయాంశంగా మారింది. పెళ్లి, రిసెప్షన్‌కు సంబంధించిన వివరాలు నెట్టింట వైరల్ కావడంతో నటుడు విజయ్ టీమ్ స్పందించి అసహనం వ్యక్తం చేసింది. వివాహ వేడుకలకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియాలో పంచుకోవడం వల్ల అతిథులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని పేర్కొంది.
టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుకలకు హాజరుకానున్న నేపథ్యంలో, పెళ్లి వివరాలు మరియు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లను పబ్లిక్‌గా షేర్ చేయడం సరికాదని టీమ్ తెలిపింది. పెళ్లి పూర్తిగా వ్యక్తిగత కార్యక్రమమని, ఇలాంటి విషయాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ముందు సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేసింది.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!