
క్రీడలు

దేశ ప్రజలందరికీ తన పెళ్లి ఆనందాన్ని ప్రత్యేకంగా పంచుకోవాలని నటుడు విజయ్ నిర్ణయించుకున్నారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అభిమానులకు స్వీట్లు పంపిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ దేశంలోని అందమైన మనుషులందరికీ మా జీవిత ప్రయాణంలో మీరు ఎప్పుడూ భాగస్వాములే. మా పెళ్లిని మీ అందరితో కలిసి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అని ఆయన సందేశంలో తెలిపారు. భారతదేశంలో ప్రతి వేడుకను స్వీట్లు, విందులతో జరుపుకునే సంప్రదాయం ఉన్నందున మార్చి 1 న దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రేమతో నిండిన స్వీట్లను పంపుతున్నట్లు పేర్కొన్నారు.
అంతేకాకుండా, దేశవ్యాప్తంగా అనేక ఆలయాల్లో అన్నదానం కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. తమ కొత్త జీవితానికి అందరి ఆశీర్వాదాలు కోరుకుంటున్నట్లు తెలిపారు.









.png&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!