31, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుంది: విజయ్ దేవరకొండ

Writer: Chandrika 06:00 AM, 31 ఆగస్టు, 2026
సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుంది: విజయ్ దేవరకొండ

‘రోమాంచకం’ ప్రీ-రిలీజ్ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ కథానాయకుడు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరై చిత్రబృందానికి శుభాకాంక్షలు తెలిపారు. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్‌కుమార్ జంటగా నటించిన ఈ చిత్రానికి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. భద్రకాళి పిక్చర్స్ పతాకంపై ప్రణయ్ రెడ్డి వంగా నిర్మించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగా సమర్పకులుగా వ్యవహరించారు. సెప్టెంబర్ 3న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగాతో తనకున్న ప్రత్యేక అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘అర్జున్ రెడ్డి’ కోసం తామిద్దరం ఒక యుద్ధంలా పనిచేశామని, ఆ సమయంలో ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకమే తమ బంధానికి కారణమని చెప్పారు. ‘రోమాంచకం’తో సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుందని విజయ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ ‘అర్జున్ రెడ్డి’తో తనకు, విజయ్ దేవరకొండకు లభించిన అనుభూతి దర్శకుడు వేణుతో పాటు ‘రోమాంచకం’ చిత్రబృందానికి కూడా కలగాలని ఆకాంక్షించారు. తాను పేరుకే సమర్పకుడినని, సినిమా కోసం తన అన్న ప్రణయ్ రెడ్డి వంగా, ఇతర చిత్రబృందం ఎంతో శ్రమించిందని తెలిపారు. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేశారు. సుమంత్ ప్రభాస్ మాట్లాడుతూ విజయ్ దేవరకొండ మరోసారి ఈ వేడుకకు రావడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. సందీప్ రెడ్డి వంగా నిర్మాణంలో సినిమా చేయడం తనకు గర్వంగా ఉందని, ‘రోమాంచకం’ తన కెరీర్‌లో మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. సినిమాలోని పాత్రలు, వాటి అమాయకత్వం ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మెహర్ రమేశ్, శౌర్యువ్, సునీల్ నారంగ్ తదితర సినీ ప్రముఖులు, చిత్రబృందం పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చిన్న సినిమా...భారీ వసూళ్లు

చిన్న సినిమా...భారీ వసూళ్లు

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

‘టార్టాయిస్‌’తో రాజ్‌ తరుణ్‌ కొత్త అవతారం

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది  - నమిత

గతంలో నా ప్రవర్తన అలా ఉండేది - నమిత

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

మాధవ్‌ ‘మారెమ్మ’ ట్రైలర్‌ డేట్‌ ఫిక్స్‌

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

వినూత్న కథతో ‘చిరంజీవి’ మ్యాజిక్‌...

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

ట్యాగ్లు
విజయ్ దేవరకొండరోమాంచకంసందీప్ రెడ్డి వంగాసుమంత్ ప్రభాస్అనంతిక సనీల్‌కుమార్రోమాంచకం ప్రీ రిలీజ్ ఈవెంట్భద్రకాళి పిక్చర్స్తెలుగు సినిమాటాలీవుడ్వేణుగోపాల్ రెడ్డి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..
క్రీడలు

పాకిస్థాన్‌పై ఇంగ్లండ్‌ ఘన విజయం..

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత
రాజకీయాలు

యూపీలో అఖిలేశ్‌ మళ్లీ సీఎం కావాలంటే ఓవైసీ మద్దతు అవసరం: ఏఐఎంఐఎం నేత

తెలంగాణ పారిశ్రామిక రంగంలో కొత్త శకం..
జనరల్

తెలంగాణ పారిశ్రామిక రంగంలో కొత్త శకం..

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం
జనరల్

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఉజ్బెకిస్థాన్‌లో 30 రోజుల వీసా-ఫ్రీ ప్రయాణం

ఇంటి డౌన్‌ పేమెంట్‌ కోసం పీఎఫ్‌ డబ్బు వాడొచ్చా?
బిజినెస్

ఇంటి డౌన్‌ పేమెంట్‌ కోసం పీఎఫ్‌ డబ్బు వాడొచ్చా?

1,000 రోజుల ప్రజాపాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక...
జనరల్

1,000 రోజుల ప్రజాపాలనలో తెలంగాణ ప్రగతి నివేదిక...

విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ ముప్పు..
జనరల్

విద్యార్థుల్లో పెరుగుతున్న డ్రగ్స్‌ ముప్పు..

సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుంది: విజయ్ దేవరకొండ
సినిమాలు

సుమంత్ ప్రభాస్‌కు ఊహించని విజయం దక్కుతుంది: విజయ్ దేవరకొండ

ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం..
జనరల్

ప్రపంచంలోనే తొలి ఓం ఆకార ఆలయం..

19 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి చేసుకున్న భక్తి టీవీ..
జనరల్

19 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానం పూర్తి చేసుకున్న భక్తి టీవీ..

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి నేటి జ్యోతిష్య ఫలితాలు ఇవే
జనరల్

నేటి రాశిఫలాలు: 12 రాశుల వారికి నేటి జ్యోతిష్య ఫలితాలు ఇవే

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌
గాసిప్స్

అల్లు అరవింద్‌కు యశ్‌ తల్లి కౌంటర్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!