
రాజకీయాలు

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా, రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రణబాలి’. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించినప్పటికీ, ప్రస్తుతం వసూళ్లు క్రమంగా పుంజుకుంటున్నట్లు సమాచారం. విజయవాడలో జరిగిన దసరా ఉత్సవాల సందర్భంగా విజయ్ దేవరకొండ సినిమా గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తాను నటించిన 14 చిత్రాల్లో ‘రణబాలి’ కచ్చితంగా టాప్ 3 సినిమాల్లో ఒకటిగా నిలుస్తుందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. దశాబ్దాలు గడిచినా ఈ సినిమా ప్రేక్షకులకు గుర్తుండిపోతుందని అన్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి అజయ్–అతుల్ సంగీతం అందించారు. ప్రస్తుతం టికెట్ విక్రయాలు ఆశాజనకంగా ఉన్నట్లు తెలుస్తుండటంతో, వారాంతం ముగిసే సమయానికి సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనే ఆసక్తి నెలకొంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!