

హీరో విజయ్ దేవరకొండ మరియు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కలయికలో గతంలో వచ్చిన సూపర్ హిట్ చిత్రం టాక్సీవాలా. ఆ విజయవంతమైన కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతోంది. వీరి కొత్త సినిమా అధికారికంగా ఖరారై, ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను ఏర్పరుస్తోంది.
గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని విడుదల చేసిన గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోంది. అదే గ్లింప్స్‌తో ఈ చిత్ర టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించారు. ఈ పవర్ఫుల్ మూవీకి రణబాలి అనే పేరును ఖరారు చేశారు. విజయ్ దేవరకొండ కెరీర్లో ఇది 14 వ చిత్రం కావడం విశేషం. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందాన నటిస్తోంది. అలాగే హాలీవుడ్ నటుడు ఆర్నాల్డ్ వొస్లు కీలక పాత్రలో కనిపించనుండగా, సంగీతాన్ని అజయ్–అతుల్ అందిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు టి-సిరీస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
బ్రిటిష్ పాలన కాలంలో సాగిన కథ, అప్పటి సామాజిక పరిస్థితులు, ఆకలి చావులు, వీరోచితంగా కనిపించే విజయ్ దేవరకొండ గెటప్ ఇవన్నీ సినిమాపై హై ఎక్స్‌పెక్టేషన్స్‌ను మరింత పెంచుతున్నాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!