
సినిమాలు

ఎస్‌సీఎస్ ఫిలిమ్స్ బ్యానర్‌పై సైఫుద్దీన్ మాలిక్ దర్శకత్వం వహించి, నిర్మించిన “విచిత్ర” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను దర్శకుల సంఘం అధ్యక్షులు వి.ఎన్. ఆదిత్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంతో సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. సినిమా వచ్చే నెల 22 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా దర్శకుడు, నిర్మాత సైఫుద్దీన్ మాలిక్ మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుల సంఘం ఎన్నికల్లో గెలుపొందిన వి.ఎన్. ఆదిత్యకు శుభాకాంక్షలు తెలియజేశారు. “విచిత్ర” సినిమా బాగా వచ్చిందని, వచ్చే నెల 22 న విడుదల కానుందని తెలిపారు. దర్శకులు వి.ఎన్. ఆదిత్య మాట్లాడుతూ టైటిల్ చాలా ఆసక్తికరంగా ఉందని, ట్రైలర్ కూడా బాగుందని ప్రశంసించారు. టెక్నికల్ టీమ్ పనితీరును అభినందిస్తూ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!