
క్రీడలు

వరుస పరాజయాల తర్వాత హీరో సూర్య నటించిన వీరభద్రుడు సినిమాతో మంచి కంబ్యాక్ సాధించాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఆలస్యంగా విడుదలైన ఈ చిత్రం మే 15న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదట పెద్దగా అంచనాలు లేకపోయినా, పాజిటివ్ టాక్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది.
కేవలం నాలుగు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ చిత్రం ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ.9.82 కోట్ల షేర్ వసూలు చేసింది. రూ.7.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను దాటేసి, మొత్తం రూ.18.45 కోట్ల గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసింది. ఇప్పటివరకు బయ్యర్లకు రూ.2.32 కోట్ల లాభాలను అందించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!