

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న #VT15 సినిమాకు ‘కోరియన్ కనకరాజు (KOKA)’ అనే టైటిల్‌ను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మెర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ మరియు ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. హారర్–కామెడీ అంశాలతో భారత్, కొరియా నేపథ్యాల్లో కథ సాగనుంది.
టైటిల్ గ్లింప్స్‌లో కొరియన్ పోలీసుల విచారణ, మిస్టరీ వాతావరణం, ఆపై కనకరాజుగా వరుణ్ తేజ్ శక్తివంతమైన ఎంట్రీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రగ్గడ్ లుక్, ప్రత్యేక టాటూలు, బ్లూ ఐస్‌తో కనిపించిన వరుణ్ తేజ్ పాత్రకు కొత్తదనం తెచ్చారు. ఈ చిత్రంలో రితిక నాయిక్ హీరోయిన్గా నటిస్తుండగా, సత్య కీలక పాత్రలో కనిపించనున్నారు.
సినిమాకు ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, గ్రాండ్ విజువల్స్, హై ప్రొడక్షన్ విలువలతో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 వేసవిలో థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
.jpg&w=3840&q=75)










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!