

పారిస్ లోని లే గ్రాండ్ రెక్స్ (Le Grand Rex) థియేటర్‌లో వారణాసి సినిమా టీజర్ ప్రదర్శించబడుతుందని ముందుగానే వార్తలు వచ్చాయి. అనుకున్నట్లుగానే భారత కాలమానం ప్రకారం సోమవారం రాత్రి 9 గంటలకు ఆ థియేటర్‌లో టీజర్‌ను అధికారికంగా ప్రదర్శించారు. ఈ ఘనత సాధించిన తొలి మరియు ఏకైక భారతీయ సినిమాగా వారణాసి నిలిచి, భారతీయ సినీ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని నమోదు చేసింది.
ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన ప్రేక్షకులు దర్శకుడు రాజమౌళి అలాగే తెలుగు సినిమాను ప్రపంచ స్థాయిలో ప్రశంసిస్తున్నారు. థియేటర్ యాజమాన్యం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పోస్ట్ చేయగా, గంటల వ్యవధిలోనే 30 వేల వ్యూస్ దాటాయి. అంతేకాదు, ఆ థియేటర్ ఖాతాలో ఇప్పటివరకు అత్యధిక వ్యూస్ వచ్చిన పోస్ట్ ఇదే కావడం విశేషం, ఎందుకంటే గతంలో వారి పోస్టులు 10 వేల వ్యూస్ కూడా దాటలేదు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!