
న్యూస్

నందమూరి బాలకృష్ణ నటించిన భారీ యాక్షన్ చిత్రం “అఖండ 2” డిసెంబర్ 12 న విడుదలై మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. పవర్ఫుల్ యాక్షన్ సన్నివేశాలు, సనాతన ధర్మ రక్షణ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటోంది. బాలకృష్ణ పవర్ఫుల్ నటన ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలిచింది.
ఈ క్రమంలో సోమవారం (డిసెంబర్ 29) “అఖండ 2” సినిమాను కేంద్ర మంత్రి బండి సంజయ్ వీక్షించారు. సినిమా అనంతరం ఆయన మాట్లాడుతూ, బాలకృష్ణ నటనలోని పవర్, ఆధ్యాత్మిక భావం, డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను బలంగా ఆకట్టుకున్నాయని తెలిపారు. ఆధ్యాత్మిక విలువలతో కూడిన మాస్ ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా నిలిచిందని ఆయన ప్రశంసించారు.

















.avif&w=3840&q=75)


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!